Tuesday, March 25, 2014

'యమ' హచ్ 370

బొఇంగ్ లోపమా ??
పైలెట్ల పరాకాష్టా  ??
తీవ్ర వాదుల  ఊగ్రరూపమా ??
ప్రకృతి ప్రలయమా ??

ఏమో , ఇంకేమో ??
మహా సాగరం లో సమాధి  అయ్యారా !
మిత్రులారా , మీకు ఇవే నా అశ్రు నయనాల తో నివాళి !!!  

నిరాశ

విశ్రమించు నేస్తమా , విశ్రమించు  నీ  అన్వేషణ !!
జీవ జల ఊటలు కావివి , ఎండమావులివి !
కన్న తల్లి ఒడి కాదిది , విషం కక్కుతున్న వేశ్య ఒడి !
విశ్రమించు నేస్తమా , విశ్రమించు  నీ  అన్వేషణ !!

సేవా భావానికి, సెలవిక్కడ !
సహ్రుదయలు, లేరిక్కడ !
విశ్రమించు నేస్తమా , విశ్రమించు  నీ  అన్వేషణ !!


అనురాగాల హరివిళ్ళు లేవిక్కడ !
అనుబందాల అంబారిలు కరువిక్కడ !
విశ్రమించు నేస్తమా , విశ్రమించు  నీ  అన్వేషణ !!

పేదవాడి ఆకలి తీరదు ఎప్పటకి !
కుబేరుల అజిర్తి  తగ్గదు ఎప్పటకి !
విశ్రమించు నేస్తమా , విశ్రమించు  నీ  అన్వేషణ !!

ప్రజాస్వామ్య తంతు కాదిది !
దళారుల దందా  ఇది !!
విశ్రమించు నేస్తమా , విశ్రమించు  నీ  అన్వేషణ !!

పూరిల్లు - మేడిల్లు, తూర్పు పడమరలిక్కడ !
కులమతాలు శాశ్వత మిక్కడ !
విశ్రమించు నేస్తమా , విశ్రమించు  నీ  అన్వేషణ !! 

Sunday, March 23, 2014

ఉన్నత విద్య కోసం నేను బెంగుళూరు IISc కి వచ్చే టప్పుడు నా ఆలోచనలు

ఆశలు ఎన్నో , అవకాశాలు కొన్నే !
భాద్యతలు ఎన్నో , బరువులు ఇంకెన్నో !
పరిక్షలు ఎన్నో , మార్కులు కొన్నే !
పాటాలు ఎన్నో , గుణపాటాలు  ఇంకెన్నో!
కోరికలు ఎన్నో , డబ్బులు కొన్నే !
చెప్పలేని నిజాలు ఎన్నో , వాటిని దాచే ప్రయత్నాలు ఇంకెన్నో !!

అమ్మ చేతి కమ్మని రుచులు  ఇక దూరమౌనేమో !
చెల్లి అనురాగం ఇక రోజు దొరకదు ఏమో !
మిత్రుల అభిమానం ఇక కరువయనేమో  !

కోకిల గానమా ? వీధీ కుక్క గాండ్రమా??
అమృత ఘడియలా ?  చిమ్మ చికటులా ?
వసంతాల వికాసమా  ?  పాతాల ప్రళయమా ?
చిరునవ్వులా  ? చేదు గుళికలా ?
ఇది పురొగతా ? తిరోగమనమా  ?



చిలిపి మాటలు

ఒరయ్ స్వామి , ప్రియురాలు   స్వీట్  రా !
భార్య కరక్కాయ  సుమి !

మొదటది పైత్యం తెస్తుంది!
రెండవది  పైత్యం వదిలిస్తుంది !!

ప్రశ్న , చిలిపి జవాబు

ప్ర : డైరెక్టర్  రాంగోపాల్  వర్మ తో సినిమా తీస్తే , నిర్మాత కి మిగిలేది ఎమిటి ??
జ : మ్యకప్ డబ్బులు మిగులు !!

ప్ర :   భర్తని భార్య విసిగిస్తే , భార్య కి భర్త ఏమి చెప్పలి ??
జ :  మలేసియా ఎయిర్ లైన్స్ విమానం ఎక్కుత అని చెప్పాలి !!! 

Wednesday, March 19, 2014

శేషాచల అరణ్యం లో అగ్ని జ్వాలలు రాజుకున్నాయ్, ఆ ప్రేరణ తో చిన్న కవిత.



మృగాలమై, వన్య జీవులను వేటడాం
చోరులమై, చందనాన్ని ఎత్తుకెల్లాం
కర్కశులమై, కాలుష్యన్ని  సృష్టించాం
అత్యాసై , అరణ్యాన్ని అక్రమించాం
మన్నించయ్య ఏడు కొండలవాడా !!
శాంతించయ్య  శేశాచలుడా !!! 
                                -- పెద్దాడ