Saturday, April 12, 2014

కన్న తండ్రి కలత

చిట్టి  తల్లి, ఓ బంగారు  తల్లి !!
పసికందువై  , నన్ను పసివాడిని చేసావ్ !
ని చేతి స్పర్శ తో , అమ్మ  ఒడి  ని గుర్తు చేసావ్ !
ని చిరు నవ్వు కోసం , పరితపించి పోయా !
ఆఫీసు సతమతలు , ని చిరు నవ్వు తో పోయె !
ని ముద్దు లొలికె మాటల వర్షం  లొ, నా  చింతలు అన్ని చెరిగి పోయె !
ని తప్పటడుగులు చూసి, నా తప్పటడుగులు సరి చేసుకొన్నా !
బంగారు  తల్లి, ఓ చిట్టి  తల్లి !!

మరి ఈ అనురాగం , శాశ్వత మా ??
ఏదో రోజు , రెక్కలు వచ్చిన పక్షి వై , ఈ  గూడు వదిలి పోతావ్ కదా !!